బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్క్.. ఇది కుక్కల వేట!
on Oct 18, 2024
బిగ్ బాస్ ఇప్పటివరకు జరిగిన సీజన్ లలో ఇంత వయిలెంట్ గా ఆడే కంటెస్టెంట్స్ లేరు. టాస్క్ లో భాగంగా జరిగిన తోపులాటలో ఒక్క నిమిషం పాటు ఏం జరిగిందన్న అనుమానం కలుగుతుంది. అసలు విషయానికి వస్తే ఓజీ క్లాన్ లోని మణికంఠ.. రాయల్ క్లాన్ వాళ్ళని అడిగి వాష్ రూమ్ కి హౌస్ లోపలికి వెళ్ళాలి. మణికంఠ అలా కాకుండా ఎవరిని అడగకుండా వాష్ రూమ్ కి వెళ్తాడు.
ఇక రాయల్ క్లాన్స్ వాళ్ళు ఊరుకుంటారా అందరూ మణికంఠ లోపల ఉండగానే.. అందరు వచ్చి మూకుమ్మడిగా చుట్టుముడతారు. తన దగ్గరున్నా పిన్ తో ఛార్జింగ్ ఎక్కించుకోవడానికి చూస్తారు. అలాగే ఓజీ క్లాన్స్ అందరు కూడా అక్కడికి వచ్చి మణికంఠ నువ్వు బయటకు రావొద్దంటూ గట్టిగా అరుస్తారు. అక్కడ ఒకరికొకరు నెట్టుకోవడం జరుగుతుంది. అక్కడున్న వస్తువులన్నీ కింద పడిపోతాయ్. గౌతమ్ నిఖిల్ మెడని గట్టిగా పట్టుకోవడంతో గౌతమ్ ని సోఫాలోకి నెడతాడు నిఖిల్. దాదాపు అయిదు నిమిషాల పాటు మినీ యుద్ధమే జరిగింది. ఇక్కడ గొడవ ఇక్కడే ఉంటే.. మరొకపక్క మణికంఠ వాష్ రూమ్ లో ఉండగా తేజ, అవినాష్ లు వెళ్లి ఛార్జింగ్ ఎక్కించుకుంటారు.
మమ్మల్ని అడిగి మా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి కదా అంటూ రాయల్ క్లాన్ వాళ్ళు గొడవపడతారు. ఇక ఆ గొడవ చుసిన వాళ్ళంతా ఇంత వయిలెంట్ గా ఉన్నారేంటి పొరపాటునా ఏదైనా అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది.. అర్గుమెంట్ కాదు.. అది కొట్లాట అని చెప్పొచ్చు. నిఖిల్, గౌతమ్, పృథ్వీ ఫిజికల్ అయ్యారు. ఇక ఈ వీకెండ్ లో నాగార్జున మాత్రం అందరికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.
Also Read